Site icon Prime9

Operation Akarsh: ఆపరేషన్ ఆకర్ష్ భగ్నం.. 400కోట్ల డీల్ తో తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర

Police foiled Operation Akarsh

Police foiled Operation Akarsh

Munugodu: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ కు పోలీసులు చెక్ పెట్టారు. 400కోట్లతో నలుగురు అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ను కొనుగోలు చేసేందుకు వేసిన పెద్ద ప్లాన్ ను పోలీసులు బెడిసికొట్టేలా చేశారు.

హైదరాబాదు మెయినాబాద్ ఫాం హౌస్ కేంద్రంగా సాగిన ఈ ఆకర్ష్ ను పోలీసులు భగ్నం చేశారు. ఘటన స్ధలంలో లభ్యమైన 15కోట్ల నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. గువ్వలబాలరాజు, హర్షవర్దన రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభ పెట్టేందుకు యత్నంగా పోలీసులు భావిస్తున్నారు. ఫాం హౌస్ లోకి రంగ ప్రవేశం చేసిన పోలీసులకు విలువైన సమాచారం కూడా అందిన్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ నుండి వచ్చిన పీఠాధిపతి రామచంద్రభారతి కేంద్రంగా ఈ మద్యవర్తిత్వం సాగిన్నట్లు తెలుస్తుంది. మరో మద్యవర్తిగా డెక్కన్ ఫ్రైడ్ హోటల్ ఓనర్ నందు సాగించిన్నట్లు పోలీసుల మాటలతో తెలుస్తుంది. ఆకర్ష్ కార్యచరణను ముందస్తుగానే టీఆర్ఎస్ అధినేతలకు చెప్పడంతో పోలీసులతో భారీ స్కెచ్ వేసి కారణమైన పార్టీని ఇరికించే భాగంలోనే ఇదంతా జరిగిందని వాస్తవాలతో తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: Rapolu Anand Bhaskar: బీజేపీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా

Exit mobile version