Site icon Prime9

Viral news: లారీ ఎక్కిన ’విమానం‘

plane

plane

Adilabad: సాధారణంగా విమానాలు గాల్లో ఎగురుతాయని మనకు తెలుసు. కాని అదే విమానం రోడ్డుపై వెళ్తే ఎలా ఉంటది. నమ్మశక్యంగా లేకపోయిన ఇది నిజంగా జరిగిన సంఘటన ఎక్కడ అనుకుంటున్నారా, ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. టాటా ఎయిర్ లైన్స్‎కు చెందిన ఏ 320 విమానం మరమ్మతుల కోసం హైదరాబాద్ నుండి నాగపూర్ కు రోడ్డు ద్వారా తీసుకువెళ్లారు.

ఈక్రమంలోనే ఆ లారీ 44వ నెంబర్ జాతీయ రహదారి పై కొందరి కంట పడింది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరెడిగోండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద లారీ పై ప్రయాణమవుతున్న విమానాన్ని చూడడానికి జనాలు ఎగబడ్డారు. లారీ పై రవాణా అవుతున్న విమానాన్ని చూసి ఇలాంటి దృశ్యం మళ్లీ కనిపిస్తుందో లేదో అని తమ సెల్‌ఫోన్‌లతో వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Exit mobile version