Site icon Prime9

Telangana News:: సమైక్యతా వారోత్సవాల్లో కుళ్లిన ఆహారం

Officials fed rotten food to students

Officials fed rotten food to students

Secunderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకొనింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు సాయన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్ధులకు పాచిన ఆహారాన్ని వడ్డించారు. కుళ్లిన వాసన వస్తుండడంతో విద్యార్ధులు కొద్దిగా తిని వదిలేశారు.

ఎండలో ర్యాలీలో తిప్పి పాచిన ఆహారాన్ని తమ పిల్లలకు పెట్టడాన్ని తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం వేడుకలకు కేటాయించిన నిదులు పక్కదారి పట్టడమే ఇందుకు కారణమంటూ ఎత్తిచూపారు. లక్షల్లో స్వాహా చేసారని విమర్శించారు. విషయాన్ని గుర్తించిన అధికారులు వెంటనే కుళ్లిన ఆహారాన్ని డస్ట్ బిన్ లో పడేసారు. విద్యార్దులను వెంటనే అక్కడ నుండి పంపించేశారు.

ముధోల్ లో కూడా ర్యాలీలో పాల్గొనకపోతే రూ. 500 ఫైన్ అంటూ అధికారులు, స్థానిక నేతలు పేర్కొనడంతో అర్ధాంతరంగా ర్యాలీ ఆగిపోయింది.

Exit mobile version