Site icon Prime9

BRS: ఇకపై టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ .. పేరు మార్పుకు ఎన్నికలసంఘం ఆమోదం

BRS

BRS

BRS: తెలంగాణ రాష్ట్ర సమితి పేరును..” భారత్ రాష్ట్ర సమితి ” గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ కు అధికారికంగా లేఖ అందింది. శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు”భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖను ఆమోదిస్తూ సమాధాన లేఖపై సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా కేసీఆర్ పంపిస్తారు. తర్వాత సీఎం కేసిఆర్ బిఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ భవన్లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తెలిపారు.

ఈ ఏడాది అక్టోబ‌ర్ 5న‌ ద‌స‌రా రోజున టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా కేసీఆర్ ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరునే భార‌త రాష్ట్ర స‌మితిగా మారుస్తూ తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా కేసీఆర్ అధికారిక‌ ప్ర‌క‌ట‌న చేశారు. ద‌స‌రా రోజున‌ నిర్వ‌హించిన పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో తీర్మానం చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్ర‌తినిధులు ఆ తీర్మానంపై సంత‌కం చేశారు.

Exit mobile version