Music university: తెలంగాణలో మ్యూజిక్ స్కూల్, సంగీత యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ విద్య మాత్రమే కాకుండా సంగీత విద్య కూడా ప్రాధాన్యంగా ఉండాలని కేటీఆర్ తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మ్యూజిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ నెల 12న మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమానికి సంగీత దర్శకుడు ఇళయరాజాతో కలిసి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
‘మ్యూజిక్ యూనివర్సిటీ లాంటి వ్యక్తి ఇళయరాజాతో కలిసి స్టేజ్ పంచుకోవడం చాలా గౌరవంగా ఉంది. ఇళయరాజా అంగీకరిస్తే తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం.’ అని కేటీఆర్ అన్నారు. దీంతో వెంటనే పక్కనే ఉన్న ఇళయరాజా స్పందిస్తూ.. తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ ఎంతో చేస్తున్నారని.. స్వయంగా మినిస్టర్ వచ్చి ప్రజలను వరాలు కోరుకోమని అడగడం చాలా ఆనందంగా ఉందన్నారు. మ్యూజిక్ నేర్చుకునే ప్రాంతంలో వైలెన్స్ ఉండదన్నారు.
మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు తాను కూడా అంగీకరిస్తున్నట్లు ఇళయరాజా తెలిపారు. మ్యూజిక్ యూనివర్సిటీ ఏర్పాటైతే తన లాంటి 200 మంది ఇళయరాజాలు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశం నుంచి వెళ్లిన చాలా మంది ప్రపంచ దేశాల్లో ప్రతిభ చూపిస్తున్నారన్నారు. ఇళయరాజా అంగీకరించడంతో తెలంగాణలో త్వరలోనే మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ సభముఖంగా ప్రకటించారు.
తన తనయుడు హిమాన్షు 3 నెలల కింద తన కుమారుడు హిమాన్షు.. తాను ఓ పాట పాడాడని.. విడుదల చేస్తున్నానని చెప్పాడు. దీంతో తాను ఆశ్చర్యపోయానని కేటీఆర్ తెలిపారు. తన వాయిస్, టాలెంట్ ను చూసి ఆశ్చర్యపోయానన్న కేటఆర్.. ఎలాంటి శిక్షణ లేకుండా ఆల్బమ్‌ను విడుదల చేశాడని పేర్కొన్నారు. చాలా మందిలో టాలెంట్ దాగి ఉంటుందని.. దాన్ని వెలికి తీయాలన్నారు.