Site icon Prime9

Moranchapalli Floods : వరద వలయంలో చిక్కుకున్న భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం.. భయాందోళనలో గ్రామస్థులు

Moranchapalli Floods cover total village and alert issued

Moranchapalli Floods cover total village and alert issued

Moranchapalli Floods : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్తులు వరదలో చిక్కుకున్నారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో మోరంచపల్లి గ్రామం ముంపునకు గురైంది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో భవనాలు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమను కాపాడాలంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. ఈ గ్రామంలో సుమారు వెయ్యి మంది జనాభా ఉన్నట్లు తెలుస్తోంది.

వాయువ్య బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.
రెడ్ అలర్ట్..
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో ప్రకటించారు.

ఎల్లో అలర్ట్..

నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల జిల్లాలు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచేర్యాల, మంచేర్యాల, జగిత్యాల, భూరినగర్, నిజాంపాలపల్లి, భూరినగర్, కరయ్యాలపల్లి, పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో  ప్రకటించారు.

గ్రామానికి సమీపంలో ఉన్న మొరంచవాగు పొంగిపొర్లడంతో వరద నీరు గ్రామంలోకి ఉదృతంగా వచ్చేసింది. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వరద ఉధృతి పెరగడంతో ఒకసారిగా మేల్కొన్న ప్రజలు హాహాకారాలు చేశారు. వెంటనే వరదలో కొట్టుకుపోకుండా ఇళ్లమీదికి ఎక్కి.. తమని తాము కాపాడుకుంటున్నారు. కాగా, క్షణక్షణానికి వరద నీరు పెరుగుతుండడంతో ప్రాణభయంతో కాపాడమంటూ వేడుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్లతో తమను రక్షించాలని మోరంచ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

వరద నీరు భారీగా చేరుకోవడంతో  బిల్డింగ్ లకు పైకి ఎక్కి ప్రాణాల రక్షించుకుంటున్నారు. మోరంచవాగు వరద ప్రవాహం గ్రామంలో ఆరు ఫీట్ల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో వరద నీటిలో ఇండ్లు తేలియాడుతున్నట్లుగా కనిపిస్తోంది. రాత్రి పడుకునే సమయంలో ఇంత వరద లేదని..  తెల్లారేవరికి వరద చుట్టుముట్టిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తెల్లవారుజాము నుంచి తాము సహాయం కోసం ఎదురుచూస్తున్నామని.. ఇప్పటి వరకు ఎవరు తమను రక్షించడానికి రాలేదన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ సహాయం కోసం ఎదురుచూస్తున్నామని అంటున్నారు.

Exit mobile version