Site icon Prime9

MLC Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్.. పార్టీ నుంచి సస్పెన్షన్

Congress MLC Teenmar Mallanna Suspension: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్ తగిలింది. ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇటీవల జరిగిన బీసీ సభలో ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. దీంతో పాటు తీన్మార్ మల్లన్న పార్టీ వ్యతిరేక చర్యలకు సైతం పాల్పడుతున్నారనే వార్తలు రావడంతో ఆయనకు ఫిబ్రవరి 5వ తేదీన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు సైతం జారీ చేసింది.

ఇందులో భాగంగానే ఫిబ్రవరి 12లోగా వివరణ ఇవ్వాలని చెప్పగా.. ఇప్పటివరకు మల్లన్న నుంచి ఎలాంటి వివరణ రాలేదు. మల్లన్న స్పందించకపోవడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా, తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ జి.చిన్నారెడ్డి పేరిట ఉత్తర్వులు వెలువడడం విశేషం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు తీన్మార్ మల్లన్న నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.

Exit mobile version
Skip to toolbar