Site icon Prime9

MLC Kavitha: ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత.. అండగా వెళ్లిన బీఆర్ఎస్ నేతలు

cbi-to-record-mlc kavita-statement-today-in-delhi-liquor-case

cbi-to-record-mlc kavita-statement-today-in-delhi-liquor-case

MLC Kavitha: దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ ఈడీ ఎదుట ఎమ్మెల్సీ కవిత మరోసారి విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. కవిత వెంట భర్త అనిల్.. ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కవిత వెన్ను తట్టి ఈడీ కార్యాలయంలో విచారణకు పంపించారు.

చట్టంపై గౌరవంతోనే..

కవిత ఈడీ విచారణకు వెళ్లడంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. కవిత వెళ్లేది ఈడికి భయపడి కాదని.. చట్టం పై గౌరవంతోనే వెళ్తున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. విపక్షాలను టార్గెట్ చేసి దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందరిపై విచారణ చేయకుండా, కేవలం విపక్షాలకు చెందిన నేతలపైనేదాడులు జరుపుతున్నారని మండిపడ్డారు.

10 పైసలతో పోల్చిన మంత్రి.. (MLC Kavitha)

దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. లిక్కర్ స్కాంని పది పైసలతో పోల్చారు.

లక్షల కోట్లు ఎగ్గొట్టినవారిని వదిలేసి తెలంగాణ ఆడబిడ్డను వేధిస్తున్నారని మండిపడ్డారు.

దిల్లీ లిక్కర్ పాలసీ గురించి ఢిల్లీ కేబినెట్ నిర్ణయం ప్రకారం ఇందులో ఏపీ, తెలంగాణ వాళ్ళు ఉంటే ఉండొచ్చన్నారు. ఆదివారం సాయంత్రమే కవిత దిల్లీకి చేరుకున్నారు.

కవిత నివాసానికి తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెళ్లారు. విచారణకు ముందు ఆమె మరోసారి న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు.

దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కవితకు మూడోసారి నోటీసులిచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, సెక్షన్ 50కింద కవిత స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డు చేయనుంది.

ఇప్పటికే బ్యాంకు స్టేట్ మెంట్స్ సహా ఈడి అడిగిన 12 డాక్యుమెంట్లను కవిత అందజేశారు.

వాస్తవానికి కవిత ఈనెల 16నే రెండోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాను హాజరుకాలేనని ఈడీకి ఆమె అదే రోజు న్యాయవాది ద్వారా లేఖ పంపారు.

తనను ఇంటివద్దే విచారించాలని కోరారు. అయితే ఈడీ అందుకు నిరాకరించింది. మరోసారి.. మార్చి 20న హాజరుకావాలని నోటీసులు పంపింది.

దీంతో ఆమె ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు కవితను రామచంద్ర పిళ్లై, మనీష్ సిసోడియాతో కలిపి విచారించే అవకాశం ఉంది.

Exit mobile version