MLC Kavitha: కవిత పిటిషన్ పై నేడు కోర్టు విచారణ

తెలంగాణ (హైద్రాబాద్ ) ఢిల్లీ మద్యం పాలసీలో తనపై తీవ్ర ఆరోపణలు చేసారని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పరువునష్టం దావా వేశారు. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు 9వ చీఫ్‌ జడ్జ్‌ ముందు ఇంజక్షన్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్‌ దాఖలు చేశారు.

  • Written By:
  • Publish Date - August 24, 2022 / 03:25 PM IST

Hyderabad: తెలంగాణ (హైద్రాబాద్ ) ఢిల్లీ మద్యం పాలసీలో తనపై తీవ్ర ఆరోపణలు చేసారని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పరువునష్టం దావా వేశారు. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు 9వ చీఫ్‌ జడ్జ్‌ ముందు ఇంజక్షన్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్‌ దాఖలు చేశారు.

ఎంపీ పర్వేశ్‌ వర్మ, మంజీందర్‌సింగ్‌ సిర్సా తనపై కావాలని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసారని, ఆధారలు లేకుండా ఆరోపణలు చేసారని ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించే వాళ్ళు ప్రకటనలు చేశారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజల్లో తనకున్న మంచి పేరును, ప్రతిష్టను చెడగొట్టడానికి ఈ రకంగా కుట్రకు పాల్పడ్డారని ఇలాంటి దురాక్రమ పద్ధతులను వారు ఎంచుకున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో ఆమె చర్చలు జరిపామని తెలిపారు. తనపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి కూడా నిజం కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తనపై ఆరోపణలు చేసిన బీజేపపీ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టును కోరారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ప‌ష్టం చేశారు. కేసీఆర్‌ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారని కవిత అన్నారు. కేసీఆర్‌ను ఎలా ఐనా మానసికంగా కృంగదీసేందుకే, బీజేపీ నేతలు ఇలా నాపై ఆరోపణలు చేసారని మీడియా ముందు తెలిపారు. ఎవరికీ నేను భయపడేదే లేదని బీజేపీ కక్ష పూరితంగానే నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని తెలిపారు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై కొందరు తప్పుడు అసత్య ప్రచారరాలు చేశారని ఆమె మీడియా ముందు తెలిపారు. హైద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో కవిత పరువు నష్టం దావా. కవిత పిటిషన్ కాసేపటిలో విచారణ జరగనుంది.