Site icon Prime9

MLA Rajaiah: కడియం శ్రీహరి 361 మంది నక్సలైట్లను చంపించారు.. ఎమ్మెల్యే రాజయ్య

Station Ghanpur: ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్‌లో రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకే పార్టీలో ఉండి కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

తాజాగా కడియం టార్గెట్ గా రాజయ్య సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్నపుడు 361 మంది నక్సలైట్లను పొట్టబెట్టుకున్నారని కడియంను ఉద్దేశించి రాజయ్య విమర్శలు గుప్పించారు. ఇక స్టేషన్ ఘన్పూర్ తన అడ్డా అని, తన అడ్డాపై ఎవరిని అడుగు పెట్టనివ్వనన్నారు. వైఎస్‌ఆర్ తనకు గురువైతే, కేసీఆర్ దేవుడన్నారు రాజయ్య. ఇక రాజయ్య చేసిన వ్యాఖ్యలు స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్ లో దుమారం రేపుతున్నాయి.

మరోవైపు రాజయ్య ఆరోపణలకు కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. మతిస్దిమితం లేక తీవ్రనిరాశలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. తాగి సమావేశాలకు వెడితే ఇలాగే ఉంటుందని అన్నారు. రాజయ్య నాలుగుసార్లు గెలిచి ఏం చేసారో చెప్పాలన్నారు. స్టేషన్ ఘన్ పూర్ ఎవరి అడ్డా కాదన్నారు. రాజకీయాల్లో ఉన్నపుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని అన్నారు.

Exit mobile version