Site icon Prime9

TS High Court: సిట్ తోనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీజేపీ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

SIT

SIT

Hyderabad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి ఇవ్వాలంటూ బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసి పుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ద్వారానే విచారణ కొనసాగించాలని ఆదేశించింది. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్ పారదర్శకంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు సూచించింది.

దర్యాప్తు బృందం మీడియాకు కానీ, ప్రభుత్వానికి కానీ ఎలాంటి వివరాలు లీక్ చేయకూడదని చీఫ్ జస్టిస్ ధర్మానసం షరతులు విధించింది. ఈ కేసులో దర్యాప్తు విషయంలో గోప్యత పాటించడం, సిట్ చీఫ్ సీవీ ఆనంద్ బాధ్యత అని హైకోర్టు తెలిపింది. ఈ కేసు విషయంలో సిట్ ఎలాంటి రాజకీయ, ప్రభుత్వ అధారిటీకి రిపోర్ట్ చేయకూడదని నివేదికను సీల్డ్ కవర్‌లో ట్రయల్ కోర్టుకు అందచేయాలని స్పష్టం చేసింది.

మొయినాబాద్‌ ఫామ్‌ హౌస్‌ కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నించారని రామచంద్రభారతి, కోరె నందకుమార్‌, సింహయాజిల పై కేసులు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. సిట్‌కు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా న‌ల్ల‌గొండ ఎస్పీ రెమా రాజేశ్వ‌రి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ క‌మ‌లేశ్వ‌ర్ సింగేన‌వ‌ర్‌, శంషాబాద్ డీసీపీ ఆర్ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, నారాయ‌ణ‌పేట ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు, రాజేంద్ర‌న‌గ‌ర్ డివిజన్ ఏసీపీ గంగాధ‌ర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిని నియమించారు.

Exit mobile version