Minister KTR: తెలంగాణ గ్రామాలు దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా మారాయని రాష్ట్ర పురపాలక శాక మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా వరుసగా మూడు సార్లు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ జిల్లా పరిషత్‌గా నిలవడం గొప్ప విషయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీలు సాధించిన ప్రగతి.. ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో పాఠ్యాంశాలుగా బోధిస్తుండటం రాష్ట్రానికే గర్వ కారణమన్నారు.
అత్యుత్తమ జిల్లాగా రాజన్నసిరిసిల్ల(Minister KTR)
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వరుసగా మూడుసార్లు దేశంలోనే అత్యుత్తమ జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలిచిందని కేటీఆర్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి వల్లే ఈ పురస్కారాలు వస్తున్నాయన్నారు. గతంలో ఉత్తమ గ్రామాలుగా గంగదేవిపల్లి, అంకాపూర్ మాత్రమే ఉండేవని.. ఇప్పుడు అనేక గ్రామాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయని తెలిపారు. రూ. కోటి లోపు ఉన్న బకాయిలన్నీ వెంటనే విడుదల చేస్తున్నామని వెల్లడించారు.
మొత్తం రూ. 1300 కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపైనా మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులను కేంద్రం నొక్కిపెడుతోందని తీవ్ర స్ధాయిలో విమర్శించారు. కాగా , పేపర్ లీక్ పై వస్తున్న ఆరోపణలపై కేటీఆర్ అక్కడి సభలో స్పందించారు. ధర్మపురి అర్వింద్ ది ఫేక్ సర్టిఫికెట్ అని..ఇక బండి సంజయ్, రేవంత్ రెడ్డి జీవితంలో ఒక్కసారైనా పరీక్షలు రాశారా అని ప్రశ్నించారు.
కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకున్న ఏబీవీపీ
కాగా, సిరిసిల్ల పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పేపర్ లీకేజీ కేసులో బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు పక్కకు ఈడ్చుకెళ్లారు. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్ ను వెంటాడారు.