Site icon Prime9

Minister Indrakaran Reddy: మాకు ఇష్టం ఉన్నవారికే దళితబంధు ఇస్తాం.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

Indrakaran Reddy

Indrakaran Reddy

Nirmal District: తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దళిత బంధు మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ చేసేందుకు వెళ్లారు. అక్కడ దళిత బంధు గురించి ప్రశ్నించిన మహిళల పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీకు ఓపిక లేకుంటే మేం ఏం చేయాలి. ఏ ఊకుండమ్మా, నువ్వు మాట్లాడకు, మా ఇష్టమొచ్చినొళ్లకు ఇచ్చుకుంటాం. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అట్ల, బయటకు తీసుకుపోండి. పో బయటకు పో. అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. దళిత బంధు పథకం అందరికీ వస్తుంది. కాస్త ఓపిక పట్టాలని సూచించారు. దళిత బంధుతో కార్లు, ట్రాక్టర్లు కొంటే అవి అన్నం పెడతాయా అని ప్రశ్నించారు. 10 లక్షలతో ఏం చేసి బతుకుతారు. మీకు ఏం అనుభవం ఉందో చెబితేనే దళిత బంధు ఇస్తామని అన్నారు.

బీజేపీ వాళ్ళతో తిరుగుతున్న వాళ్ళు, వాళ్ళనే అడిగి దళిత బంధు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మీరు మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి అంటూ సభలో ప్రశ్నించిన వారిని బయటకు తీసుకు వెళ్లాలని మంత్రి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మరో మహిళ కూడా దళిత బంధు గురించి అడగడంతో ఆమెను మాట్లాడకుండా దబాయించి కూర్చోబెట్టారు. ఇక మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తీరు పై స్థానికులు మండిపడుతున్నారు.

 

Exit mobile version