Harish Rao: తెలంగాణ ఆర్దిక మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 80వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా శిల్పకళా వేదికలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు హరీశ్ రావు నియామక పత్రాలను అందజేశారు. వైద్య రంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామని తెలిపారు.
నియామక పత్రాలు అందజేత..
తెలంగాణ ఆర్దిక మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 80వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా శిల్పకళా వేదికలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు హరీశ్ రావు నియామక పత్రాలను అందజేశారు. వైద్య రంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామని తెలిపారు.
శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డు అని మంత్రి అన్నారు. త్వరలో 80వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు.. 1,331 మంది ఆయుష్ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించామన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఆరోగ్యశాఖలో 22,263 మందికి ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి అన్నారు. మరో 9,222 పోస్ట్‌లకు రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నారు. వైద్యులు సమాజానికి సేవ చేయాలని.. రోగులకు వచ్చిన బాధను అర్ధం చేసుకునేది ఒక్క వైద్యులేనని హరీశ్ రావు అన్నారు. వచ్చే నెల నుంచి టి డియాగ్నస్టిక్స్‌లో 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ప్రస్తుతం 54 పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అన్నారు.