Site icon Prime9

Malla Reddy: పవన్‌ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా అడిగారు.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Minister Mallareddy

Minister Mallareddy

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి గురించి అందరికి తెలిసిందే. ఆయన ఏమి మాట్లాడిన కొన్ని సందర్బాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చిత్రంలో విలన్ గా తనను సంప్రదించినట్లు తెలిపారు.

పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం..(Malla Reddy)

మంత్రి మల్లారెడ్డి గురించి అందరికి తెలిసిందే. ఆయన ఏమి మాట్లాడిన కొన్ని సందర్బాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చిత్రంలో విలన్ గా తనను సంప్రదించినట్లు తెలిపారు. ఇక హైదరాబాద్ లో జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సుమంత్‌ ప్రభాస్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. జూన్‌లో ఇది విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పవన్ సినిమాలో వచ్చిన ఆఫర్ గురించి తెలిపారు.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించాలని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తనని కోరారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఓ సందర్భంలో తన ఇంటికి వచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. రెండు గంటల పాటు తనను బతిమిలాడరని.. కానీ నేనే చేయనని చెప్పానన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘మేమ్‌ ఫేమస్‌’ టీజర్‌ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మద్యపానం, ధూమపానం, షికార్లు, అమ్మాయిల వెంట పడటం.. ఇలాంటివి చేస్తే ఫేమస్‌ కారు. కష్టపడి పనిచేస్తేనే సక్సెస్‌ అవుతారు.

పాలమ్మిన.. పూలమ్మిన.. కాలేజీలు పెట్టిన.. టాప్‌ డాక్టర్లను, సైంటిస్టులను తయారు చేశాను.. అదీ ఫేమస్‌. కాబట్టి యువత కష్టపడి పనిచేసి అన్నింటా విజయాన్ని అందుకోవాలి.

ప్రస్తుతం యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగ పరచుకోవాలి. దానికి ఎంతో కష్టపడాలి. ఏ ఒక్కరూ షార్ట్‌కట్‌లో సక్సెస్‌ కాలేరు.

23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నాకు పెళ్లి అయ్యింది. అప్పుడు నా వద్ద ఏమీ లేదు. పాలు అమ్ముకునేవాడిని.

కేసీఆర్‌ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యాను. కాబట్టి ఇప్పటికైనా షికార్లు బంద్‌ చేసి జీవితంలో ముందుకెళ్లడంపై దృష్టి పెట్టాలి.

ఈ సినిమా టీజర్‌ నాకెంతో నచ్చింది. తప్పకుండా సక్సెస్‌ అవుతుంది. ఇది సక్సెస్‌ అయ్యాక ఈ హీరోతో నేనొక సినిమా చేస్తా.

అలాగే, ఎన్నికలు అయిపోయాక తెలంగాణ యాసలో పలు చిత్రాలు నిర్మిస్తా. హరీశ్‌ శంకర్‌ మా ఇంటికి వచ్చాడు. గంటన్నర బతిమిలాడాడు.

పవన్‌కల్యాణ్ సినిమాలో విలన్‌గా చేయమన్నాడు. చేయనని చెప్పా అని ఆయన వివరించారు.

Exit mobile version