Site icon Prime9

Malla Reddy: బండి సంజయ్ పై మంత్రి మల్లారెడ్డి ఫైర్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

malla-reddy-not-attending-for-it-Enquiry

malla-reddy-not-attending-for-it-Enquiry

Malla Reddy: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యల పట్ల వెంటనే సంజయ్ క్షమాపణలు చెప్పాలని మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. బండి వ్యాఖ్యల పట్ల మంత్రి మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. సంజయ్ కాస్త మెంటల్ సంజయ్ అంటూ.. మండిపడ్డారు.

సంజయ్ కాదు.. మెంటల్ సంజయ్

బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కాదని.. ఆయన మెంటల్ సంజయ్ అని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ నాయకులు తీరు మార్చుకోకుంటే తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ స్పందించారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే.. కల్వకుంట్ల కవితను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడే ప్రభుత్వం తమదేనని మంత్రులు అన్నారు. దేశవ్యాప్తంగా కేసీఆర్‌ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బండి వ్యాఖ్యలపై గవర్నర్‌ తమిళిసై స్పందించాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌ చేశారు.

 

బండి సంజయ్ పై కేసు.. (Malla Reddy)

సంజయ్‌ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బండి సంజయ్ పై తక్షణమే విచారణ జరపాలని డీజీపికి ఆదేశించింది. బండి సంజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.మహిళల గౌరవాన్ని కించపరిచేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్ వ్యక్తిగతంగా హాజరుకావాలని తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

మరోవైపు కవిత ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆమెకు మద్దతుగాత తెలంగాణ లో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భారాస శ్రేణులు, నేతలు పలు చోట్ల దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో ఆందోళనకు దిగారు. వెంటనే సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని.. కవితకు క్షమాపణ చెప్పాలని భారాస కార్యకర్తలు డిమాండ్ చేశారు. దిల్లీలో కవిత విచారణ, నగరంలో భారాస ఆందోళనల దృష్ట్యా నగరంలోని బషీర్‌బాగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయానికి తాళాలు వేసి.. పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలు దారుణమని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్‌ వ్యాఖ్యలపై స్పందించే ధైర్యం గవర్నర్‌కు ఉందా అని ఆయన ప్రశ్నించారు.

Exit mobile version
Skip to toolbar