Site icon Prime9

Hyderabad: హైదరాబాద్ అభివృద్ధిపై రీల్స్ చేయండి.. రూ. 50వేలు గెలవండి

reels

reels

Hyderabad: సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. అద్భుతమైన రీల్స్ చేసే వారికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. హైదరాబాద్ అభివృద్ధిని గురించి వీడియో తీసి పోస్ట్ చేస్తే.. విజేతకు రూ. 50 వేల ప్రైజ్ ప్రకటించింది. తెలంగాణ డిజిటల్‌ మీడియా వింగ్‌ ‘హ్యాపెనింగ్‌ హైదరాబాద్‌ రీల్స్‌ కాంటెస్ట్‌’ నిర్వహిస్తోంది. దీనికోసం భారీగా ప్రైజ్‌ మనీ కూడా ప్రకటించింది.

రీల్స్ చేయు.. ప్రైజ్ కొట్టు (Hyderabad)

సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. అద్భుతమైన రీల్స్ చేసే వారికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. హైదరాబాద్ అభివృద్ధిని గురించి వీడియో తీసి పోస్ట్ చేస్తే.. విజేతకు రూ. 50 వేల ప్రైజ్ ప్రకటించింది. తెలంగాణ డిజిటల్‌ మీడియా వింగ్‌ ‘హ్యాపెనింగ్‌ హైదరాబాద్‌ రీల్స్‌ కాంటెస్ట్‌’ నిర్వహిస్తోంది. దీనికోసం భారీగా ప్రైజ్‌ మనీ కూడా ప్రకటించింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మెుబైల్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరు వీడియోలు ప్రకృతి అందాలను వీడియోలు తీస్తున్నారు. అలాంటి వారికి మంచి అవకాశం వచ్చింది.

రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచింది. ఈ తొమ్మిదేళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. నగరంలోని ప్రధాన కూడళ్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

అయితే ఈ అభివృద్ధి ఎంతలా జరిగిందో.. తెలుసుకోవడానికి ప్రభుత్వం ఓ కార్యచరణకు శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్‌ మీడియా వింగ్‌ ‘హ్యాపెనింగ్‌ హైదరాబాద్‌ రీల్స్‌ కాంటెస్ట్‌’ నిర్వహిస్తోంది. ఇందులో గెలిచిన వారికి భారీ ప్రైజ్‌ మనీ కూడా ప్రకటించింది.

విజేతలకు నగదు..

ఇందులో మెుదటి విజేతకు.. రూ. 50 వేలు.. ఫస్ట్‌ రన్నరప్‌ కు రూ.25 వేలు, సెకండ్‌ రన్నరప్‌ కు రూ.10వేలు గా నిర్ణయించింది.

ఇక ముగ్గురికి కన్సొలేషన్‌ ప్రైజ్‌ రూ.5వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. దీనికోసం.. హైదరాబాద్‌ అభివృద్ధికి అద్దంపట్టే దృశ్యాలను 60 సెకన్ల నిడివి మించకుండా వీడియో తీయాలి.

ఆ వీడియోను @DigitalmediaTS ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో పోస్టు చేయాలి. ఆ తర్వాత వీడియో లింక్‌ను dir_dm@telangana.gov.inకు మెయిల్‌ చేయాలి.

ఏప్రిల్‌ 30వ తేదీతో ఈ పోటీ ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం https://it.telangana.gov.in/contest/లో చూడాలని తెలంగాణ డిజిటల్‌ మీడియా తెలిపింది.

మే రెండో వారంలో విజేతలను ప్రకటిస్తారు.

 

Exit mobile version