Site icon Prime9

Hyderabad Metro: మెట్రోరైల్‌ నెట్‌వర్క్‌ జాబితా.. మూడో స్థానానికి పడిపోయిన హైదరాబాద్‌

Hyderabad metro

Hyderabad metro

Hyderabad Metro: హైదరాబాద్ కు మణిహారంగా వెలుగొందుతుంది మెట్రో రైల్. తెలుగు రాష్ట్రాల్లో మెట్రో రైల్ సౌలభ్యం ఉన్నది హైదరాబాద్ లో మాత్రమే. మొత్తం 69.2 కిలోమీటర్ల పొడవుతో కూడిన మెట్రో మార్గం ఉంది. మెున్నటి వరకు దేశంలో రెండోస్థానంలో నిలిచిన హైదరాబాద్ మెట్రో.. ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది.

కారణం ఇదేనా? (Hyderabad Metro)

హైదరాబాద్ కు మణిహారంగా వెలుగొందుతుంది మెట్రో రైల్. తెలుగు రాష్ట్రాల్లో మెట్రో రైల్ సౌలభ్యం ఉన్నది హైదరాబాద్ లో మాత్రమే. మొత్తం 69.2 కిలోమీటర్ల పొడవుతో కూడిన మెట్రో మార్గం ఉంది. మెున్నటి వరకు దేశంలో రెండోస్థానంలో నిలిచిన హైదరాబాద్ మెట్రో.. ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది.

దేశంలోనే అత్యంత ఎక్కువ దూరం నెట్ వర్క్ కలిగిన మెట్రో నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో కొనసాగింది.

ఇప్పుడు అది మూడో స్థానానికి పడిపోయింది. దీనికి కారణం మిగతా నగరాల్లో మెట్రో దూకుడుగా విస్తరించడమే అని తెలుస్తోంది.

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వకపోవడం కూడా ఓ కారణమని తెలుస్తోంది.

మెట్రో విస్తరణపై సంవత్సరాల తరబడి ప్రకటనలే తప్ప క్షేత్రస్థాయిలో పనులు మొదలు కాకపోవడం.. ఇతర మెట్రో నగరాలు ప్రాధాన్యం ఇచ్చి పెద్ద ఎత్తున విస్తరణ పనులు చేపట్టడంతో నెట్‌వర్క్‌ పరంగా హైదరాబాద్‌ మెట్రో వెనకబడింది.

బెంగళూరులో ప్రధాని మోదీ శనివారం కొత్తగా 13.71 కి.మీ. మార్గాన్ని ప్రారంభించారు. దీంతో బెంగళూరు నమ్మ మెట్రో నెట్‌వర్క్‌ 70 కి.మీ.కి చేరింది.

ప్రణాళికలు పట్టాలెక్కక..

అభివృద్ధి చెందిన నగరాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి.. నగరాల్లో మెట్రో సేవలను విస్తరిస్తున్నారు. మొదటి రెండు స్థానాల్లో ఉన్న దిల్లీ, బెంగళూరు నగరాల్లో భారీ ఎత్తున విస్తరిస్తున్నాయి.

చెన్నైలోనూ భారీగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో పనులు ఇలాగే సాగితే.. నాలుగో స్థానానికి పడిపోనుంది.

ఈ మూడు నగరాల్లో మెట్రో ప్రాజెక్ట్‌లకు కేంద్రం పెద్ద ఎత్తున ఆర్థిక తోడ్పాటు అందిస్తుండటంతో పనులు చకచకా సాగుతున్నాయి.

రాష్ట్రాలు సైతం అంతే స్థాయిలో నిధులు వెచ్చిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వీటిని నిర్మిస్తున్నాయి.

 

Exit mobile version