Liquor Price: తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు కిక్కు ఇచ్చే వార్త చెప్పింది. రాష్ర్టంలో మద్యం ధరలు భారీగా తగ్గించినట్టు సర్కారు వెల్లడించింది. మద్యం పై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీర్ తప్ప లిక్కర్ కు చెందిన అన్ని బ్రాండ్స్ పై ధరలు తగ్గాయి. ఫుల్ బాటిల్ పై రూ. 40, హాఫ్ బాటిల్ పై రూ. 20, క్వార్టర్ బాటిల్ పై రూ. 10 ల చొప్పున తగ్గించింది. కొన్ని రకాల బ్రాండ్స్ ఫుల్ బాటిల్ పై రూ. 60 ల వరకు తగ్గించినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. తగ్గిన ధరలు శనివారం నుంచే అమలులోకి వస్తాయి.
బీరు ధరల్లో మార్పులు లేవు(Liquor Price)
రాష్ట్రంలో అధిక ధరల కారణంగా బయట రాష్ట్రాల నుంచి లిక్కర్ అక్రమంగా వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, అక్రమ మద్యం రవాణాను నియంత్రించేందుకే ధరలు తగ్గించినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే బీరు ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేవలం లిక్కర్ బ్రాండ్స్ కు మాత్రమే కొత్త ధరలు వర్తిస్తాయి. కాగా, తెలంగాణలో ఏప్రిల్ నెలలో కోటికి పైగా బీర్లు అమ్ముడైన విషయం తెలిసిందే. ఎండల్లో చల్లబడేందుకు బీరు ప్రియులు తెగ తాగేస్తున్నారు.