Site icon Prime9

LB NAGAR: సిగ్నల్‌ ఫ్రీగా ఎల్బీనగర్‌.. ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన కేటీఆర్

lb nagar

lb nagar

LB NAGAR: తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ కూడలికి అమరుడు శ్రీకాంతా చారి పేరు పెట్టనున్నట్లు తెలిపారు.

ఫ్లై ఓవర్ కు నామకరణం.. (LB NAGAR)

తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగనున్నాయి. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఇందులో భాగంగానే.. ఎల్బీ నగర్ లో నిర్మించిన నూతన ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్లై ఓవర్ కు మాల్ మైసమ్మ అనే పేరు పెడుతున్నట్లు ప్రకటించారు.

ఎల్బీనగర్‌ కూడలిలో రూ.32 కోట్లతో నిర్మించిన హయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్లే మార్గంలో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు.

ఇక ఎల్బీనగర్‌ కూడలికి శ్రీకాంతాచారి పేరు పెట్టనున్నట్లు తెలిపారు.

ఇది వరకే ఎడమవైపు ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా కుడివైపు ఫ్లై ఓవర్ కూడా అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గనున్నాయి.

ఇది అందుబాటులోకి రావడంతో..
ఎల్బీనగర్‌ కూడలి సిగ్నల్‌ ఫ్రీగా మారింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన 35వ ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు.

మరో 12 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోనే 12 పనులు చేపట్టామని మంత్రి అన్నారు. ఇప్పటికే 9 ప్రాజెక్టులు పూర్తికాగా.. మిగతా 3 ఫ్లై ఓవర్లను సెప్టెంబరు లోపు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. నాగోల్- దిల్ సుఖ్ నగర్ మెట్రో ను త్వరలోనే అనుసంధానించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల అనంతరం మెట్రోను హయత్‌నగర్‌ వరకు విస్తరిస్తామని తెలిపారు. ఇక ఎల్బీనగర్ మెట్రో మార్గాన్ని విమానాశ్రయంతో అనుసంధానిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.

Exit mobile version