Site icon Prime9

Telangana Assembly Sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు, ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

latest update on telangana assembly sessions and rtc bill

latest update on telangana assembly sessions and rtc bill

Telangana Assembly Sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో నేడు చివరి రోజు అని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సమావేశాలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మరో 2 రోజులు పొడిగించింది. దీంతో సోమ, మంగళవారాల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరపనున్నారు.

అలానే ఈ బిల్లుకు సంబంధించి గవర్నర్‌ తమిళిసై.. ప్రభుత్వం తరఫున రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో భేటీ అయ్యారు. వారి వివరణ అనంతరం ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. అయితే, కొన్ని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ విలీన బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ బిల్లుతో పాటు ఏమైనా పెండింగ్ బిల్లులు ఉంటే వాటిపై చర్చకు నేడు సమయం సరిపోదని భావించిన సర్కార్ మరో రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

అయితే మరోవైపు తమకు సంబంధించిన బిల్లును గవర్నర్ ఆమోదించడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఛ‌లో రాజ్‌భ‌వ‌న్‌కు పిలుపు ఇచ్చారు. శనివారం రెండు గంటల పాటు బస్సు సేవల్ని నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. చివరికి ఆర్టీసీ సిబ్బంది తమ పంతం నెగ్గించుకున్నారు. ఆర్థిక బిల్లు కావడంతో ముందుగా గవర్నర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. గవర్నర్ అనుమతితోనే ఆర్థిక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. రెండు రోజుల సస్పెన్స్ తరువాత ఆర్థిక బిల్లు అయిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వం నుంచి పలు అంశాలపై స్పష్టం తీసుకున్నాక ఆర్టీసీ బిల్లును ఆమె ఆమోదించారు.

Exit mobile version