Site icon Prime9

KTR: కామారెడ్డి కలెక్టర్‌ కు కేటీఆర్ అభినందనలు

KTR-Support-Kamareddy-Collector

Hyderabad: కామారెడ్డి కలెక్టర్‌ జితేష్ వి పాటిల్‌ ఫై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ఈ విషయంలో కలెక్టర్ కు మద్దతుగా నిలిచారు. కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ఈ రాజకీయ నాయకులు నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, గౌరవప్రదమైన ప్రవర్తనకు అభినందనలు తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

శుక్రవారం బీర్కూర్‌ మండల కేంద్రంలోని ఓ రేషన్‌ దుకాణం వద్ద లబ్ధిదా రులతో కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రేషన్‌ బియ్యం పథకంలో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత, లబ్ధిదారుల వాటా ఎంత అంటూ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. కేంద్రమంత్రి వరుసగా వేసిన ప్రశ్నలతో కలెక్టర్‌ కాస్త తడబడ్డారు. దీంతో నిర్మలా సీతారామన్‌ అసహనం వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పై జిల్లా పాలనాధికారికి స్పష్టత లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్ కలెక్టర్‌ కు మద్దతుగా నిలిచారు.

 

Exit mobile version