Site icon Prime9

Minister KTR: నేడు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్దులతో కేటీఆర్ భేటీ

KTR

KTR

Hyderabad: నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి, విద్యార్థులతో నేరుగా మాట్లాడనున్నారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే జోగు రామన్నను కూడా పరామర్శించనున్నారు మంత్రులు. ఇటీవల జోగురామన్న తల్లి మరణించారు. దీపాయిగూడలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించనున్నారు మంత్రులు.

అనంతరం ఆదిలాబాద్​లోని బీజీఎన్చీ డేటా సొల్యూషన్స్​ సందర్శించి అక్కడ ఉద్యోగులతో మాట్లాడతారు. ఆ తర్వాత నిర్మల్​ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి విద్యార్థులతో కేటీఆర్​ భేటీ అవుతారు. ఆనంతరం వారితో కలిసి భోజనం చేస్తారు. ట్రిపుల్ఐటీలో సమస్యలు పరిష్కరించాలంటూ జూన్​లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అక్కడకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మరోసారి ఇక్కడకు వచ్చినప్పుడు తప్పకుండా కేటీఆర్​ను తీసుకువస్తానని చెప్పారు. ఆ హామీ మేరకు కేటీఆర్​తో కలిసి, సబితా ఇంద్రారెడ్డి ఆర్టీయూకేటీకి వెళ్లనున్నారు. కేటీఆర్ రాకతో తమ సమస్యలన్ని పరిష్కారం అవుతాయని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version