Site icon Prime9

Munugodu : కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి బాధ కలిగిస్తోంది.. పాల్వయి స్రవంతి

Palvai Sravanti

Palvai Sravanti

Munugodu: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి బాధ కలిగిస్తోందని, మాట్లాడటానికి కూడ ఏమీ లేదని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను సొంత అన్నగా భావించానని చెప్పారు. ప్రచారానికి రావాలని వేడుకున్నట్టుగా తెలిపారు.సోదరిగా వెళ్లి అన్నా మీ ఆశీర్వాదం కావాలని ఎన్నోసార్లు కోరినా నమ్మకద్రోహం చేసేలా మాట్లాడటం బాధగా ఉందన్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ప్రకటించిన అనంతరం పాల్వాయి స్రవంతి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి తన తరఫున ప్రచారం చేయాల్సిందిగా కోరారు. ఆ సమయంలో స్రవంతి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి వస్తానని చెప్పారని అన్నారు. ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని స్రవంతి కలిశారు. మునుగోడులో కాంగ్రెస్ తరఫున ప్రచారానికి రావాల్సిందిగా కోరారు. మునుగోడు ప్రచారానికి వచ్చే విషయమై ఆలోచిస్తానని వెంకట్ రెడ్డి తనకు చెప్పారని స్రవంతి ఇటీవలనే మీడియాకు చెప్పారు. స్రవంతి తల మీద కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేయి పెట్టి ఆశీర్వదిస్తున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రెండురోజులకిందట మటిరెడ్డి వెంకట్ రెడ్డిదిగా చెబుతున్న ఆడియో లీక్ అయింది. లీకైన ఆడియో టేప్ ప్రకారం.. వెంకట్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ సానుభూతిపరుడైన ఓ వ్యక్తితో మాట్లాడుతూ.. పార్టీ చూడకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరారు. చావైనా, పెళ్లైనా రాజగోపాల్ రెడ్డి సాయం చేస్తాడని అన్నారు. ఉపఎన్నికల తర్వాత తాను పీసీసీ చీఫ్‌గా ఎన్నికై, పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని చెప్పారు. అప్పుడు అందరిని జాగ్రత్తగా చూసుకుంటానని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తాజాగా ఆస్ట్రేలియాలో మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్దితి లేదని అటువంటపుడు తాను వెళ్లి ప్రచారం చేయడం అనవసరం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దీనితో కోమటిరెడ్డి వ్యతిరేక వర్గం అతడిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తోంది.

 

Exit mobile version