Khammam Blast: ఖమ్మం జిల్లా కారేపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. తాజాగా మరొకరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఇక ఈ ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఖమ్మం జిల్లా కారేపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. తాజాగా మరొకరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఇక ఈ ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియాను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు.
ఇప్పటికే ముగ్గురు మృతిచెందగా ఇతరుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
కారేపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేతలు వస్తున్న సందర్భంగా బాణసంచా కాల్చారు.
బాణాసంచా నిప్పు రవ్వలు సమీపంలో ఉన్న పూరి గుడిసెపై పడ్డాయి.
ఒక్క సారిగా మంటలు అంటుకోవడంతో అక్కడే ఉన్న పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా.. ఓ ఇంటిలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది.
ఘటన స్థలిలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. ఇద్దరు చికిత్స పొందతు మరణించారు. ఇందులో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనలో ముగ్గురు కానిస్టేబుల్స్ రెండు కాళ్లు కోల్పోయారు.
వైరా నియోజకవర్గం కారేపల్లి అగ్నిప్రమాదంపైమంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదంలోని మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా అధికారులు, నాయకులను ఆదేశించారు. ఈ మేరకు వారితో ఫోన్‌లో సంభాషించారు.