Site icon Prime9

TRS: టిఆర్ఎస్ ని వీడుతున్న ముఖ్య కార్యకర్తలు

Key workers leaving TRS

Key workers leaving TRS

Hyderabad: ఉద్యమం పేరుతో అధికారంలోకి రెండు పర్యాయాలు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్ఊ) పార్టీకి ఉద్యమ నాయకులే షాక్ ఇస్తున్నారు. పార్టీని వీడుతూ టిఆర్ఎస్ గాలి తీస్తున్నారు.

తాజాగా చెన్నూరు టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు బాల్క సుమన్ ముఖ్య అనుచరుడు చెరుకు సర్వోత్తమ రెడ్డి పార్టీ నుండి వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదని ఆత్మగౌరవంతోనే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భీమారం మండలానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బాల్క సుమన్ విఫలం చెందడాన్ని ప్రత్యేకంగా సర్వోత్తం ప్రస్తావించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొందరికి మాత్రమే అనుమతి వుందని, త్వరలో మరింత మంది టిఆర్ఎస్ ను వీడనున్నట్లు ఆయన తెలిపారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని ఆయన కార్యకర్తలతో చెబుతున్నారు.

Exit mobile version