CM KCR: విజయవాడకు వెళ్లనున్న సీఎం కేసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ నెలలో విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం. విజయవాడలో జరగనున్నసిపీఎం జాతీయ మహాసభలో ఆయన పాల్గొననున్నారు

Vijayawada: ఈ సభకు కేరళ, బీహార్ సీఎంలతో పాటు 20 దేశాలకు చెందిన కమ్యూనిస్ట్ నేతలు కూడా హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపీఎం పాదయాత్రలు, బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ఆ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు అనంతపురంలో పేర్కొన్నారు.

విజయవాడ, పుట్టపర్తి, విశాఖపట్నం సభల్లో బృందాకారత్, సీతారాం ఏచూరి, బివి రాఘవులు పాల్గొననున్నారు. కడప ఉక్కు కర్మాగారానికి నిధుల మంజూరుతో పాటుగా రాజధాని నిర్మాణంలో రాష్ట్రానికి మద్దతు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందడం వంటి అంశాల పై మాట్లాడనున్నారు.

గతంలో కాళేశ్వరం ప్రాజక్ట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసిఆర్ స్వయంగా ఏపి సీఎం జగన్ ను ఆహ్వానించేందుకు విజయవాడకు వచ్చారు. 3 సంవత్సరాల అనంతరం సిపీఎం జాతీయ సభలకు కేసిఆర్ హాజరుకానున్నారు. బీజేపీ ముక్త భారత్ పేరుతో ఇప్పటికే జాతీయ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న కేసిఆర్ ఆ దిశగా వేస్తున్న అడుగుల్లో భాగంగానే విజయవాడకు రానున్నారు. అయితే జగన్ కు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయన్ను కలుస్తారో లేదో తెలియాల్సి ఉంది.