Site icon Prime9

Thummala Nageswara Rao: కేసీఆర్ వెంటే ఉంటాను.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Tummala

Tummala

Khammam: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల పై క్లారిటీ ఇచ్చారు. తాను కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేసారు. గురువారం తన అభిమానులతో వాజేడులో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీంతో తుమ్మల పార్టీ మారుతారన్న ప్రచారం జోరందుకుంది. ఈ సందర్బంగా తుమ్మల మాట్లాడుతూ రాజకియాల్లో ఒడిదోడుకులు సహజమన్నారు. రాబోయేవి మన రోజులే, ఎవరు అధైర్య పడొద్దు, ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు దైర్యం చెప్పారు.

ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేల కోట్లు ఇచ్చారని అన్నారు. మనకు మేలు చేసే వ్యక్తులనే మనం ఆదరించాలి లేకుంటే ఇబ్బందులు వస్తాయని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మనం పని చేయాల్సిన అవసరం ఉందని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అనుచరులకు పిలుపు నిచ్చారు. ఈ రోజు జరిగిన కార్యక్రమం కేవలం యాదృచ్చికంగా జరిగిందన్నారు. నేను ఎవరిని రమ్మనలేదు. ఇంత మంది నా అనుచరులు ఎందుకు వచ్చారో తెలియదని అన్నారు. తన అనుచరులు వెంటవుంటే కొండలనయినా పిండి చేస్తానని అన్నారు. 40ఏళ్లు రాజకీయంగా ఏ విధంగా ఉన్నానో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ఉంటానని తుమ్మల చెప్పారు.

ములుగు జిల్లా వాజేడులో తన అభిమానులతో తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేశారు. గురువారం ఉదయం భద్రాద్రి రామయ్య ఆలయంలో ప్రత్యేక​ పూజలు నిర్వహించిన తుమ్మల, 350 కార్లతో ర్యాలీగా వాజేడుకు వెళ్లారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుమ్మల అనుచరులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పు పై జోరుగా ఊహాగానాలు వస్తున్న వేళ ఈ సమావేశం జరిగింది.

Exit mobile version