Ex CI Nageswara Rao: మహిళ కేసులో మాజీ పోలీసు అధికారికి బెయిల్ మంజూరు

ఓ మహిళపై అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్ ఆరోపణలపై సస్పెండ్ అయిన మారేడ్ పల్లి మాజీ వలయాధికారి నాగేశ్వరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Hyderabad: ఓ మహిళ పై అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్ ఆరోపణలపై సస్పెండ్ అయిన మారేడ్ పల్లి మాజీ వలయాధికారి నాగేశ్వరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచికత్తు, పలు షరత్తులు విధిస్తూ ధర్మాసనం బెయిల్ మంజూరు అయింది. రెండు నెలల పాటు ప్రతీరోజు ఉదయం 10 గంటలకు విచారణ అధికారి ముందు హాజరుకావాలని నాగేశ్వరరావుకు హైకోర్టు పేర్కొనింది. గతంలో రెండు సార్లు బెయిల్ కోసం వేసిన పిటిషన్లను కోర్టు నిరాకరించింది. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు అయింది.

వనస్ధలిపురంలో ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి, ఆమె తలపై తుపాకీ గురిపెట్టి బెదిరించాడు. అనంతరం నాగేశ్వరావు అత్యాచారయత్నానికి పాల్పొడ్డారు. ఘటనతో ఆయన్ను విధుల నుండి తొలగించివున్నారు.

ఇది కూడా చదవండి:  తెలంగాణలో మూడు జిల్లా ఆరోగ్య సేవలు తగ్గాయి