Telangana Rains: తెలంగాణను వర్షాలు వీడటం లేదు. ఎండాకాలంలో కూడా.. వర్ష కాలంలాగే వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రానున్న మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
మూడు రోజులు వర్షాలు..
తెలంగాణను వర్షాలు వీడటం లేదు. ఎండాకాలంలో కూడా.. వర్ష కాలంలాగే వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రానున్న మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణ్ పేట్, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో.. కుండపోత వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. గంటకు 41 నుంచి గరిష్ఠంగా 61 కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వర్షాలు పడనున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం.. ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో కొనసాగుతూ, సగటు సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు ఉందని వివరించింది.
తీవ్రంగా పంటనష్టం..
ఇప్పటికే తెలంగాణలో వర్షాల వల్ల తీవ్రంగా పంటనష్టం వాటిల్లింది. చాలా చోట్ల ఆస్తినష్టం జరిగింది. గతంలో మునుపెన్నడూ లేని స్థాయిలో పంట నష్టం జరిగిందని.. మంత్రి గంగులా కమలాకర్ అన్నారు. ధాన్యం తడిసినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.