Rain: అకాల వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. మధ్యాహ్నం వరకు వేడిగా ఉండి.. సాయంత్రానికి చల్లబడి భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో పంటనష్టం వాటిల్లింది.
భారీ వర్షం..
అకాల వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. మధ్యాహ్నం వరకు వేడిగా ఉండి.. సాయంత్రానికి చల్లబడి భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో పంటనష్టం వాటిల్లింది.
హైదరాబాద్ లో పలుచోట్లు కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్ లోని ముఖ్య ప్రాంతాలనైన.. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నాచారం, మల్లాపూర్, ఘట్ కేసర్, పోచారం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ వర్షం పడింది. దీంతో చాలా చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. కొన్ని కాలనీలు.. రహదారులు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కాలనీలను వరదనీరు ముంచేత్తడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఉప్పల్ కూడలి నుంచి వరంగల్ ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది.