Prime9

Harish Rao: ఇరిగేషన్ అభ్యర్థుల పోస్టింగ్ పై హరీష్‌ ఫైర్

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ నాయుకులు హరీష్‌రావు మరోసారి విమర్శలు చేశారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ, 199 జెటీవోలుగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వని చందంగా ఉంది. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబురాన్ని లేకుండా చేస్తున్నది దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు.

 

కొండంత సంతోషంతో హైదరాబాద్ కు రావడం, నిరాశతో వెనుతిరిగి పోవడం విద్యార్థుల వంతు అవుతుందని ఆరోపించారు హరీష్ రావు. ప్రచార ఆర్భాటం పక్కన బెట్టి, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియమకపత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.

 

 

Exit mobile version
Skip to toolbar