Site icon Prime9

Food poisoning: గురుకులంలో ఫుడ్ పాయిజన్

Food poisoning in Gurukulam

Food poisoning in Gurukulam

Kagaznagar: తెలంగాణాలో అనేక చోట్ల విద్యార్ధులు పుడ్ పాయిజన్ కు గురౌతున్నారు. పేదలను ఆదుకొంటున్నామంటున్న వారే చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పట్టెడి అన్నం తినే ఆ నోటికాడ కూడులో కాసుల కక్కుర్తి విద్యార్ధుల గొంతు నొక్కేస్తుంది. అన్నింటిని మౌనంగా రోధిస్తూ భరించడమే జీవితంగా, చిన్న వయస్సులోనే ఆ చిన్నారులకు అలవాటైపోతుంది. విద్యతోనే పేదరిక నిర్మూలనగా భావించే గురుకులాలే వారికి ప్రాణ సంకటంగా మారిన సంఘటనలు తల్లి తండ్రుల గుండెల్లో గుబులును రేకెత్తిస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్లితే, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మైనార్టీ గురుకులంలో 5,6 తరగతి విద్యార్ధులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. పురుగుల అన్నం తినడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత చోటుచేసుకొన్న ఈ ఘటనలో 27మంది విద్యార్ధులు వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డారు. తోటి విద్యార్థుల అందించిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమైనారు. వెంటనే అస్వస్ధతకు గురైన వారందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యార్ధులు ధర్నా చేపట్టారు. మెనూ ప్రకారం ఆహారం నియమాలు పాటించడంలేదని ఆ చిన్ని హృదయాలు కోప్పొడుతూ ప్రశ్నించాయి. పట్టించుకోవాల్సిన ప్రధానోపాధ్యాయులు సైతం కిమ్మనకుండా ఉండడం పై విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటిదినం ఉదయమే ఫలహారం బాగలేదని చెప్పామని, రాత్రి భోజనంలో పురుగులు ఉన్నాయని విద్యార్ధులు కన్నీట పర్యంతమైనారు. నాణ్యతలేని తిండి తిని చదువు ఎలా సాగించాలని వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది.

ఇంత జరుగతున్నాప్రభుత్వానికి చీమకుట్టిన్నట్లుగా కూడా లేదు సరికదా, అస్వస్ధతకు గురైనా విద్యార్ధులు పరిస్ధితిని సైతం వాకబు చేయకపోవడం గమనార్హం. సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన వజ్రోత్సవాల పేరుతో చేపట్టిన కార్యక్రమాల్లో కూడా విద్యార్ధులు చెడిపోయిన ఆహారాన్ని భుజించి కొంతమంది ఆసుపత్రి పాలైన విషయం అందరికి తెలిసిందే.

Exit mobile version