CM KCR: చివరి రోజైనా బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన కేసీఆర్.. కేంద్రం ధ్వజమెత్తారు. అభివృద్ధిలో సాగుతున్న భారతదేశం ను మోదీ ప్రభుత్వం వెనక్కి నెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతో పోలిస్తే.. మోదీ ప్రభుత్వం అభివృద్ధి అన్నింటిలో వెనకబడిందని విమర్శలు గుప్పించారు. 2024లో భాజపా ఓడిపోవడం ఖాయమని కేసీఆర్ అన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. నేను చెప్పినవన్ని అబాద్దాలు అయితే రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా కేంద్రంపై కేసీఆర్ విమర్శలు సంధించారు. మన్మోహన్‌సింగ్ హయాంలో ఉన్నా అభివృద్ధి.. మోదీ హయాంలో లేదని కేసీఆర్ అన్నారు. అన్ని రంగాల్లో భారత్ వెనకబడిందని కేసీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అహంకారం ఎన్నో రోజులు ఉండదని.. భాజపా కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. గత కాంగ్రెస్ పాలనతో పోలీస్తే.. మోదీ ప్రభుత్వం వెనుకబడి ఉందని కాగ్ గణంకాలే చెబుతున్నాయని అన్నారు. తాను చెప్పే మాటలు అబద్ధాలు అయితే.. రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు.
బీబీసీ డాక్యుమెంటరీపై కేసీఆర్ స్పందించారు. గోద్రా అల్లర్లపై తీసిన డాక్యుమెంటరీని తీస్తే.. ఎలా బ్యాన్ చేస్తారని ప్రశ్నించారు. మాట్లాడితే.. జైలులో వేస్తామని భాజపా నేతలు బెదిరిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఇంతటి జులుం, అహంకారం ఎన్నిరోజులు ఉంటుందో చూస్తామన్నారు. 2024 ఎన్నికల్లో భాజపా కుప్పకూలడం ఖాయమన్నారు. బంగ్లాదేశ్ మీద గెలిచినపుడు.. వాజ్‌పేయీ స్వయంగా దుర్గామాత ఆఫ్ హిందుస్థాన్ అని ఇందిరా గాంధీని పొగిడారు. ఆ తర్వాత ఇందీరా గాంధీ ఎలా ఓడిపోయారో.. కేసీఆర్ వివరించారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదని.. సంయమనం పాటించాలని కోరారు.
ప్రభుత్వం వ్యాపారాత్మక ధోరణిలో వ్యాపారం చేయకూడదని కేసీఆర్ హితవు పలికారు. అవసరమైన చోట మాత్రమే వ్యాపారం చేయాలన్నారు. రైతుల ధాన్యం కొనాల్సి వచ్చినప్పుడు నష్టం వచ్చినా కొన్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో వార్షిక వృద్ధిరేటు 6.8శాతం ఉంటే.. భాజపా హయాంలో 5.5శాతానికి వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. యూపీఏ కాలంలో 24శాతం వృద్ధిరేటు ఉండేదన్నారు. మన్మోహన్ కాలంలో.. తలసరి ఆదాయం వృద్ధిరేటు 12.73 ఉంటే.. మోదీ పాలనలో 7.01శాతానికి దిగజారింది. జీడీపీలో అప్పుల శాతం 66.7శాతం ఉంటే.. మన్మోహన్‌సింగ్ పాలన ముగిసే సమయానికి 52శాతానికి తగ్గిందన్నారు. మోదీ హయాంలో 52.2శాతం నుంచి 56శాతానికి అప్పులను పెంచారని కేసీఆర్ ఆరోపించారు. అప్పులు చేయడంలో ప్రధానిని మించిన వారు లేరని కేసీఆర్ ఎగతాళి చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎగుమతుల వృద్ధి రేటు 19.5శాతం ఉంటే.. మోదీ హయాంలో 4.9శాతానికి పడిపోయిందన్నారు. ఇందులో ఓ ఒక్కటి అబద్ధమైనా రాజీనామా చేస్తా అని ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే రాష్ట్రానికి న్యాయం చేసిందని కేసీఆర్ అన్నారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలను ఇస్తే.. తెలంగాణకు ఒక్కటీ కూడా ఇవ్వలేదన్నారు. దీన్ని బట్టే కేంద్రంకు రాష్ట్రంపై ఉన్న వివక్ష ఏంటో అర్ధం చేసుకోవాలని కేసీఆర్ అన్నారు. గిరిజన యూనివర్సిటీ కూడా ఇవ్వలేదని అన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ఇదే సభలో.. నిధులేవి అడిగితే పైసాకూడా ఇవ్వమని అన్నాడు. ఇలాంటి అహంకారపూరిత రాజకీయం మంచిది కాదన్నారు.