Site icon Prime9

Ed Inquiry: 8 గంటలుగా సాగుతున్న విచారణ.. బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్

Ed Inquiry

Ed Inquiry

Ed Inquiry: దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో( (Delhi Liquor Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను దాదాపు 8 గంటలకు పైగా కొనసాగుతోంది. విచారణ తర్వాత మరికాసేపట్లో బయటకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

కవిత సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు విచారణకు హాజరయ్యారు. అప్పటి నుంచి సుదీర్ఘంగా ఆమె విచారణ కొనసాగుతోంది. ఈడీ సంధించిన పలు ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదని తెలుస్తోంది. కవిత, అరుణ్‌ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు.

ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్‌ గ్రూప్ పాత్రపై ఈడీ ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు.

 

బీఆర్ఎస్ టెన్షన్(Ed Inquiry)

రాత్రి 8 గంటలైనా ఇంతవరకూ కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటికి రాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోయింది. మొదటిసారి కవితను విచారించినప్పుడే సాయంత్రం 6 గంటలు దాటితే మహిళను విచారించకూడదని.. అది చట్ట విరుద్ధమని కవిత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.

అయితే రెండోరోజు విచారణలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అసలు ఈడీ కార్యాలయంలో ఏం జరుగుతోంది..? ఏం జరగబోతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది.

 

ఈడీ ఆఫీస్ కు లాయర్లు(Ed Inquiry)

మరోవైపు ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు. అయితే న్యాయవాదులు ఎందుకొచ్చారు..? కవితను అరెస్ట్ చేసే సూచనలు ఏమైనా ఉన్నాయా..? అనేది అర్థం కావట్లేదు.

ఉదయం నుంచి ఈడీ కార్యాలయం చుట్టుపక్కలా పరిస్థితి అంతా సాధారణంగానే ఉంది. అయితే సాయంత్రం తర్వాత ఈడీ ఆఫీసు వద్దకు న్యాయవాదులు రావడంతో హస్తినలో సీన్ మారిపోయింది. దీంతో ఏం జరుగుతోందో ఏంటో అని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నెలకొంది.

 

Exit mobile version