MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు అందింది. నేడు ఈడీ కార్యాలయానికి రావాలని.. లేఖ ద్వారా తెలిపింది. ఈడీ నోటీసులపై స్పందించిన కవిత.. తన లీగల్ అడ్వైజర్‌ను ఈడీ కార్యాలయానికి పంపించారు.
దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు అందింది. నేడు ఈడీ కార్యాలయానికి రావాలని.. లేఖ ద్వారా తెలిపింది. ఈడీ నోటీసులపై స్పందించిన కవిత.. తన లీగల్ అడ్వైజర్‌ను ఈడీ కార్యాలయానికి పంపించారు. మార్చి 11న ఎమ్మెల్సీ కవితకు చెందిన ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఈ నెల 21న తన తొమ్మిది ఫోన్లను ఈడీకి అందజేసింది.
ఈడీకి అందజేసిన ఫోన్లను ఓపెన్ చేసేందుకు.. సాక్షిగా కవిత గానీ, ఆమె ప్రతినిధి గానీ రావాలని ఈడీ అధికారులు కోరారు. ఈ మేరకు లీగల్ అడ్వైజర్ సోమా భారత్‌కు ఆథరైజేషన్ ఇచ్చి తన ప్రతినిధిగా ఈడీ కార్యాలయానికి విచారణకు పంపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇప్పటి వరకు మూడుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈనెల 11,20,21 తేదీల్లో ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.