Eatala Rajender: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ పేపర్ లీక్ అవ్వలేదని.. అది కేవలం మాల్ ప్రాక్టీస్ అని అన్నారు. పేపర్ బయటకు వచ్చిన ఘటనలో.. ఈటల విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈటల కామెంట్స్..
ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ పేపర్ లీక్ అవ్వలేదని.. అది కేవలం మాల్ ప్రాక్టీస్ అని అన్నారు. పేపర్ బయటకు వచ్చిన ఘటనలో.. ఈటల విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. పేపర్ లీక్ అవ్వలేదని.. అది కేవలం మాల్ ప్రాక్టీస్ అని అన్నారు.
ఈ విచారణకు ఈటల రాజేందర్.. తన ఫోన్ తో స్వయంగా హాజరయ్యారు. అధికారుల సమక్షంలో ఫోన్ ను పరిశీలించారు. తనకు ప్రశాంత్ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని అధికారులు నిర్దారించారు. కేసీఆర్ కావాలనే.. భాజపా నేతలను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. అక్రమంగా కేసులు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని ఈటల స్పష్టం చేశారు.
ఈ మేరకు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. దేశంలో ధనిక సీఎంగా కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ ఈ ఎనిమిదేళ్లలో వేల కోట్లు సంపాదించారని అన్నారు. ఇన్ని కోట్లు కేసీఆర్ కు ఎలా వచ్చాయే చెప్పాలని డిమాండ్ చేశారు.