Site icon Prime9

Talasani Srinivas yadav: ఈ నెల 5 నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ.. మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్

Fish-seed-Distribution-ts

Hyderabad: ఈ నెల 5 నుంచి తెలంగాణవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాద‌‌వ్‌ అన్నారు. వచ్చే సోమవారం కార్యక్రమాన్ని ప్రాంభించనున్న ‌నేపథ్యంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తం 26,778 నీటి వనరులలో రూ.68 కోట్ల చేప పిల్లలు విడుదల చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. సోమవారం (ఈనెల 5న) జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని ఘన్‌పూర్ రిజర్వాయర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేప పిల్లలను విడుదల చేయనున్నారు.

Exit mobile version