Site icon Prime9

Dharmapuri Arvind: బండి సంజయ్ పై ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా?

Aravind

Aravind

Dharmapuri Arvind: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని అర్వింద్ హితవు పలికారు.

అర్వింద్ ఏమన్నారంటే?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ మేరకు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్సీ కవితకు వెంటనే బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో భాజపా కు చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ తీరుని తప్పు పట్టేలా ఆయన విమర్శలు చేశారు. కవితపై చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించడం లేదని చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకోవడం మంచిదని హితవు పలికారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. దీంతో ఈ వ్యాఖ్యలు భాజపా వర్గాల్లో వైరల్ గా మారాయి.

ఈడీకి సహకరించని కవిత.. (Dharmapuri Arvind)

కవిత వివాదంపై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. పార్టీకి సంబంధం లేదని అన్నారు. దీనిపై పార్టీ వివరణ ఇవ్వదని.. బండి సంజయ్ మాత్రమే వివరణ ఇచ్చుకోవాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి సెంటర్ కాదని.. అందరినీ సమన్వయం చేసే బాధ్యత తనదేనని అన్నారు. కవిత ఈడీ ఆఫీసులో ఉంటే.. మంత్రులు దిల్లీలో మకాం వేశారని అర్వింద్ విమర్శించారు. ఈడీ దర్యాప్తుకు కవిత సహకరించలేదని తమకు తెలిసిందని అర్వింద్ తెలిపారు. ఎందుకు? ఏమిటి? ఎలా? అని ఈడీ అధికారులు అడిగితే.. ఏమో, తెలవదు, గుర్తులేదు అని కవిత సమాధానం చెప్పినట్టు తెలిసిందన్నారు. కేసీఆర్, కవిత ఒత్తిడి వల్లే అరుణ్ రామచంద్ర పిళ్ళై తన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు.

ఈడీ విచారణపై కీలక వ్యాఖ్యలు..

కవితను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. సుమారు 9 గంటల పాటు కవితను విచారించారు. దీనిపై ధర్మపురి అరవింద్ స్పందించారు. కేసీఆర్ ఒత్తిడి వల్లే.. రామచంద్ర పిళ్ళై తన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్ళారని అన్నారు. ఇది లిక్కర్ కేసులో మరింత కీలకం కానుందన్నారు. సీఎం కేసీఆర్ రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. కవితకు ఈడీ నోటీసులతో తెలంగాణ ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు.

Exit mobile version