Cyber Crime: సినీ, రాజకీయన నేతల ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో రాజకీయ, సినీ నేపథ్యం ఉన్నవారిని టార్గెట్ గా చేసుకొని వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. అలా చేస్తున్న 8 మందిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో పలు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు.
8మంది అరెస్ట్.. (Cyber Crime)
సినీ, రాజకీయన నేతల ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో రాజకీయ, సినీ నేపథ్యం ఉన్నవారిని టార్గెట్ గా చేసుకొని వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. అలా చేస్తున్న 8 మందిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో పలు జిల్లాలకు చెందిన వారు ఉన్నారు.
సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ఫోటోలు మార్ఫింగ్ చేసి.. యూట్యూట్, ట్విట్టర్ లో షేర్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇలా ఇరు రాష్ట్రాల్లో ట్రోలింగ్ కు పాల్పడుతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు.
ఇప్పటి వరకు వీరిపై 20 కేసులు నమోదు నమోదు చేశామని తెలిపారు. తాజాగా మరో 30 మంది ట్రోలర్స్‌కు నోటీసులు పంపించామని డీసీపీ తెలిపారు.
కవితపై అధిక ట్రోలింగ్..
ఎమ్మెల్సీ కవితపై సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఎక్కువగా ట్రోలింగ్ జరిగిందని హైదరాబాద్ క్రైమ్ డీసీపీ స్నేహా మోహ్రా తెలిపారు.
వ్యూస్ కోసం కొన్ని యూట్యూట్ ఛానెల్స్, యువత కవిత ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసినట్లు తెలిపారు.
అలాగే అసభ్య పదాలతో.. కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసిన వీడియోలను పోస్ట్ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
అలాగే ప్రభుత్వ పెద్దలపైనా వారి వ్యక్తిగత ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్రోలింగ్ కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.
తాజాగా అరెస్ట్ చేసిన వారితో శ్రీనివాసరావు, బద్దంజి శ్రవణ్, చిరసాని మణికంఠ, మోతం శ్రీను, వడ్లూరి నవీన్, పెరక నాగవెంకట కిరణ్, బొల్లి చంద్రశేఖర్, బిల్ల శ్రీకాంత్ ఉన్నట్లు చెప్పారు.