Site icon Prime9

CP Ranganath: బండి సంజయ్‌ ఫోన్ లో కీలక సమాచారం.. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

cp ranganath

cp ranganath

CP Ranganath: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఆయన్ను ఏ1గా చేర్చారు. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రెస్ మీట్ లో సీపీ రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు.

కీలక విషయాలు వెల్లడి.. (CP Ranganath)

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఆయన్ను ఏ1గా చేర్చారు. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రెస్ మీట్ లో సీపీ రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు బండి సంజయ్ ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్రశాంత్.. ఏ3గా మహేశ్, ఏ4 గా శివగణేష్ పేరును చేర్చారు. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. మెుత్తం ఇందులో పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సీపీ ఏమన్నారంటే..

పదో తరగతి పేపర్ లీకేజీపై సీపీ రంగనాథ్ జరిగిన పరిణామాలను వివరించారు. కమలాపూర్‌ ప్రభుత్వ పాఠశాల నుంచి పరీక్ష పత్రం బయటకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

ఇక ఈ కేసులో బూర ప్రశాంత్ అనే వ్యక్తిని పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1గా బండి సంజయ్ ను చేర్చారు. సంజయ్ పై.. 120బి, 420, 447, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు.

అందరిపై కేసు నమోదు చేయలేదు..

ప్రశ్నపత్రం ఫార్వార్డ్ చేసిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయలేదని సీపీ అన్నారు. ఓ జర్నలిస్ట్.. తన విధుల్లో భాగంగా ప్రశ్నపత్రాన్ని మీడియా హెడ్స్ కి పంపించినట్లు వివరించారు.

11.20 నిమిషాలకు బూర ప్రశాంత్‌ .. బండి సంజయ్‌కు వాట్సప్‌లో పంపారు. ఇందులో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. అతడి పీఏ కూడా ఈ ప్రశ్నపత్రాన్ని పంపించినట్లు తెలిపారు.

ఈ పేపర్ బయటకు రావడానికి గల వ్యక్తులపైనే కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రశాంత్ కు బండి సంజయ్ కు మధ్య వాట్సాప్ చాటింగ్ జరిగినట్లు గుర్తించామని సీపీ అన్నారు.

బండి సంజయ్‌ ఫోన్‌ ఇవ్వట్లేదు..

బండి సంజయ్ ఫోన్ అందితే మరింత సమాచారం రావొచ్చని సీపీ అన్నారు. కానీ బండి సంజయ్ ఫోన్ గురించి అడిగితే లేదన్నారు.

కీలక సమాచారం బయటకు వస్తుందనే.. ఫోన్ ఇవ్వడం లేదని సీపీ మీడియాకు వెల్లడించారు. కొన్ని ఫోన్లలో సమాచారన్ని డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను బయటకు తీసుకొచ్చారు. తెలంగాణలో వరుసగా పేపర్ లీక్‌ జరుగుతోందనే ప్రచారం జరిగేలా కుట్ర చేశారని వివరించారు.

దీంతో సెక్షన్‌ 41ఏ సీఆర్‌పీసీ ప్రకారం బండి సంజయ్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చామని తెలిపారు.

Exit mobile version