Site icon Prime9

Lovers Suicide: పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య.. కారణం ఇదే!

lovers

lovers

Lovers Suicide: నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరన్న భయంతో.. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగి.. ఆపై చెట్టుకు ఉరేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది.

పెద్దలు ఒప్పుకోరని.. ఆత్మహత్య (Lovers Suicide)

వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇంట్లో చెప్పడానికి భయపడ్డారు. చెబితే ఏం చేస్తారో అన్న భయం వారిని వెంటాడింది. అలా అని.. ఇంకొకరిని చేసుకొవడానికి సిద్ధంగా లేరు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని తెలియడంతో.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. పురుగుల మందు తాగి.. ఆపై చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా నేరెడుగొమ్ము మండలంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామానికి చెందిన రాకేశ్‌ డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి.. కూలి పనులు చేసుకుంటున్నాడు. కూలి పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. దోనియాల గ్రామానికి చెందిన యువతి ప్రభుత్వ కళాశాలలో చదువుతోంది. వీరిద్దరికి పదోతరగతి చదువుతున్న సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ ప్రేమజంట ఆత్మహత్య ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

పురుగుల మందు తాగి.. ఆపై ఉరేసుకుని!

ఇటీవలే వారి ప్రేమ విషయం ఇంట్లో చెప్పినట్లు తెలుస్తోంది. యువకుని కుటుంబ సభ్యులు.. ప్రేమ విషయంలో సానుకూలంగా స్పందించారు. కానీ అమ్మాయి తరపు వారు ఈ ప్రేమకు నిరాకరించారు. దీంతో కుటుంబ సభ్యులు.. ఆ యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం ప్రేమించిన యువకుడి చెప్పింది. వేరొకరిని పెళ్లి చేసుకుని బతకలేనని.. వచ్చి తనను తీసుకెళ్లాల్సిందిగా కోరింది. దీంతో రాకేశ్‌ ఆమెను ఇంటి నుంచి తీసుకొచ్చాడు. నేరెడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గ్రామ శివారులో తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆపై చెట్టుకు తాడుతో ఉరి వేసుకున్నారు. ఇది గమనించిన కాచరాజుపల్లి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని.. తల్లిదండ్రులు క్షమించాలని అందులో రాసి ఉంచారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version