Site icon Prime9

Contaminated Food : వనపర్తి జిల్లాలో కలుషిత ఆహారం తిని 70 మంది విద్యార్థినులు అస్వస్థత..

contaminated food leads to 70 students illness in vanaparthi district

contaminated food leads to 70 students illness in vanaparthi district

Contaminated Food : తెలంగాణలోని వనపర్తి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న అమరచింత కస్తూర్బా విద్యాలయంలో కలుషిత ఆహారం తిని  70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా ఈ స్కూల్ లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు మొత్తం 210 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే గత రాత్రి భోజనంలో వంకాయ, సాంబారుతో పెట్టారు. విద్యార్ధులు భోజనం చేసిన తర్వాత.. సుమారు 11 గంటల సమయంలో విద్యార్థినులకు కడుపునొప్పి రావడంతో ఒక్కొక్కరుగా సిబ్బంది దగ్గరకి వెళ్లారు.

అయితే విద్యార్ధినిలు వారి సమస్య గురించి చెప్పినప్పటికీ రాత్రంతా కూడా వారిని ఆస్పత్రికి తీసుకువెళ్ళాక పోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేజీబీవీలో ఒక టీచర్‌, వాచ్‌మన్‌ మాత్రమే ఉండటంతో రాత్రి విద్యార్థినులకు బయటకి పంపలేదని చెబుతున్నారు. ఇక తెల్లవారు జామున అనారోగ్యంగా ఉన్న వారందర్నీ సమీపంలోని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ వారిలో నలుగురు విద్యార్థులకు కడుపునొప్పి తగ్గకపోవడంతో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం అందుతుంది. తొలుత 45 మందిని ఆ తర్వాత మరో 15 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆహారం విషతుల్యం కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్ధినులు వాపోతున్నారు.

విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా 9, 10, ఇంటర్‌ విద్యార్థినులే అస్వస్థతకు గురైన వారిలో ఉన్నారని తెలుస్తుంది. విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు విద్యార్థినుల అస్వస్థతకు ఆహార కలుషితం జరిగిందా? ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.

Exit mobile version