Site icon Prime9

Kcr Flight: కేసిఆర్ విమానం కొనుగోలు పై ఈడీకి ఫిర్యాదు

Complaint to ED on purchase of KCR plane

Complaint to ED on purchase of KCR plane

Hyderabad: పరుషంగా మాట్లాడడం ఆయన నైజం. ఉద్యమం మాటున అడ్డగోలు మాటలు ఆయనకే సొంతం. అయితే ఇవన్నీ ఆయనకు కూడా వర్తిస్తాయని తాజాగా కొన్ని ఘటనలు రుజువౌతున్నాయి. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ తన జాతీయ పార్టీ కోసం భారీ నగదు వెచ్చించి ఓ చార్టర్ విమానాన్ని కొనుగోలు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు కాలు దువ్వగా, తాజాగా కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు.

రాజస్ధాన్ కు చెందిన పారిశ్రామిక వేత్త యాంగ్ ఎంట్రీ పినార్ వద్ద సీఎం కేసిఆర్ విమానాన్ని కొనుగోలు చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని జడ్సన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే సీఎం కేసిఆర్ విమానం కొనుగోలు పై తగిన లెక్క, పక్క అన్ని చేసుకొని మరీ విమానాన్ని కొనుగోలు చేశాడని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఎటొచ్చి ఈడీ కేసు నమోదు చేస్తే, విచారణ సమయంలో మరేదైన అక్రమ లావాదేవీలు బయటపడతాయానని తెరాస శ్రేణులు లోలోలన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీలో బలమైన ఆర్ధిక పెద్దలు 10మంది విమానం కొనుగోలుకు విరాళం ఇచ్చిన్నట్లు సమాచారం.

ఏది ఏమైనా గతంలో పలువురు రాజకీయ నేతలపై అవాకులు, చవాకులు పేలిన కేసిఆర్ అండ్ టీం తప్పుచేసివుంటే ఎప్పటికైన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే లిక్కర్ స్కాంలో సీఎం కేసిఆర్ కూతురు కవిత హస్తం ఉన్నట్లు భాజపా నేతలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. వైఎస్సాఆర్ టీపి నాయకురాలు వైఎస్ షర్మిల కూడా పలు ఆర్ధిక కుంభకోణాలు కేసిఆర్ చేసివున్నారని, దానిపై దృష్టి పెట్టాలని సీబీఐకి ఫిర్యాదు చేసివున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ కూడా కేసిఆర్ పార్టీ విమానం కొనుగోలు పై ఫిర్యాదు చేయడం తెరాస అయింది భారాస అధినేతకు తలనొప్పిగా మారింది.

ఇది కూడా చదవండి: చండూరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సామాగ్రి దగ్దం

Exit mobile version