Site icon Prime9

MIM Leader Syed Kashaf: ఎంఐఎం నేత కషఫ్ పై పీడీ యాక్ట్

Hyderabad: సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న ఎంఐఎం నేత కషఫ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో సయ్యద్ అబ్దుల్ ఖాద్రీ అలియాస్ కషఫ్ మత విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజాసింగ్ వీడియోను షేర్ చేసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పలువురు ఆరోపించారు.

కషఫ్ వ్యాఖ్యలతో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇటీవల సిపి ఆఫీసు ముందు ధర్నాలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. కషఫ్‌కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించనున్నారు.

Exit mobile version