Site icon Prime9

CM KCR: విప్రహిత బ్రాహ్మణ సదన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

kcr

kcr

CM KCR: బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. బ్రాహ్మణ పరిషత్ కు ఏటా రూ. 100 కోట్లు కేటాయిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే చెందుతుందని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్‌ను సీఎం ప్రారంభించారు.

కేసీఆర్ ఏమన్నారంటే..

బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. బ్రాహ్మణ పరిషత్ కు ఏటా రూ. 100 కోట్లు కేటాయిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే చెందుతుందని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్‌ను సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పురవాసుల హితం కోరేవారే పురోహితులు అని అన్నారు. ఇప్పటికి బ్రాహ్మణుల్లో చాలామంది పేదలున్నారని.. బ్రాహ్మణ పరిషత్‌కు ఏటా రూ. 100కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు రూ. 12 కోట్లతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించారు. బ్రాహ్మణ సదన్‌ను నిర్మించడం దేశంలో ఇదే మొదటిసారని.. వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా బ్రాహ్మణ సదన్‌ నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. మరోవైవు రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు.

ఇప్పటికే పలు దేవాలయాలకు వర్తింపజేస్తున్న.. ధూప, దీప నైవేద్యాల పథకాన్ని మరో 2,696 దేవాలయాలకు వర్తింపజేస్తామని అన్నారు. ఈ పథకం కింద నెలకు ఇచ్చే నిధులను రూ.10వేలకు పెంచామన్నారు. వేదపండితులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5వేలకు పెంచుతామన్నారు. వారికున్న అర్హత వయసును 75 నుంచి 65 ఏళ్లకు తగ్గించామని కేసీఆర్ తెలిపారు.

బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, సీఎస్‌ శాంతికుమారి, ఎంపీ రంజిత్‌రెడ్డి, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, రాజీవ్‌శర్మ, కేవీ రమణాచారితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు, పండితులు పాల్గొన్నారు.

బ్రాహ్మణ సదన్‌ నిర్మాణానికి ప్రభుత్వం గోపన్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని కేటాయించింది.

ఇందులో బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 12 నిర్మాణాలను చేపట్టారు.

2017 జూన్‌ 5న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

మూడంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సదనం ఉన్నాయి.

Exit mobile version