Site icon Prime9

CM KCR: ఎమ్మెల్యేలను కొంటుంటే..చేతులు ముడుచుకుని కూర్చోవాల్నా!? కేంద్రంపై ధ్వజమెత్తిన కేసిఆర్

If you are buying MLAs.

 Telangana: తెలంగాణలోని మా రాజధాని హైదరాబాదుకు వచ్చి తెరాస పార్టీకి చెందిన శాసనసభ్యులను కొంటామంటే చేతులు ముడుచుకొని కూర్చోవాల్నా!? ప్రశ్నేలేదు..తాడో పేడో తేల్చుకొనేందుకు నేను రెడీ అంటూ సీఎం కేసిఆర్ కేంద్ర ప్రభుత్వం, భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం రాత్రి ఆయన ప్రత్యేకంగా మీడియాతో సమావేశమైనారు. నా ప్రభుత్వాన్ని కూలగొడతానంటే నేను ఊరుకోవాల్నా? మౌనంగా భరించాలా? దేశంకోసం చావడానికైనా సిద్ధమని కేసిఆర్ ఖరాఖండిగా చెప్పేశారు. దేశాన్ని విచ్చలవిడిగా సర్వనాశనం చేస్తామంటే ఊరుకోం. క్రూర, విశృంఖల పద్ధతుల్లో జరిగే దమనకాండను, రాజకీయ హనానాన్ని అడ్డుకోకపోతే దేశ ఉనికి అంతర్జాతీయంగా దిగజారిపోయే పరిస్ధితి ఉందని వ్యాఖ్యానించారు.

మునుగోడు ఎన్నికలు వెంటనే విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన కేసిఆర్ భారమైన మనసుతో తొలిసారిగా మాట్లాడుతున్నానని అన్నారు. 40సంవత్సరాల తన రాజకీయ చరిత్రలో నేటి ప్రజాస్వామ్య వ్యవస్ధకు మచ్చపడేలా హత్యా ఘటన ఎన్నడూ లేదని వాపోయారు. నిర్లజ్జగా, నిరాఘాటంగా హత్య కొనసాగుతోందన్నారు. చిల్లర ఆరోపణలు తిప్పికొట్టేందుకే మునుగోడు ఉప ఎన్నికల అయిన తర్వాత మీడియా ముందుకు వచ్చానని కేసిఆర్ పేర్కొన్నారు..

ఇది కూడా చదవండి: Minister KTR: పాన్ ఇండియా సినిమాను చూపిస్తా.. ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ కేసులో మంత్రి కేటిఆర్

Exit mobile version