CM KCR: తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. పలు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ పలు సూచనలు చేశారు.
తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. పలు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ పలు సూచనలు చేశారు.
తెలంగాణ భవన్ లో బీఆఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుపై కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. భారీ మెజార్టీతో గెలుస్తామని కేసీఆర్ అన్నారు.
బుధవారం నిర్వహించిన ఈ సమావేశానికి.. బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ పదేళ్ల కాలంలో ప్రజలకు చేసింది చెప్పుకుంటే చాలూ. ఏం చేశామో జనాలకు చెప్పండి. గెలుపు మనదే అవుతుంది. రైతులను చెరువుల దగ్గరికి పిలిచి మీటింగ్ పెట్టండి. వాళ్లతో కలిసి భోజనాలు చేయండి. సరిపోతుంది. సిట్టింగ్‌లకే టికెట్లు ఉంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పై కేసీఆర్ ధ్వజమెత్తారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని అన్నారు. అందుకే వాళ్ళని ప్రజలు నమ్మరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 105 సీట్లు బీఆర్ఎస్ కు వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఎవరు గెలిచినా పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించారాయన. ఎన్నికల సమాయత్తంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఆయన.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం పైనా చర్చించారు.