Site icon Prime9

Dellhi Liquor Scam: లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పై వ్యాఖ్యలు చేయవద్దు.. సిటీ సివిల్ కోర్టు

kavitha vs ED

kavitha vs ED

Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కాంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రకంపణలు రేపాయి. అయితే తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కవిత కోర్టుకెక్కారు. విచారించిన న్యాయస్థానం కవితకు ఊరటనిస్తూ తీర్పునిచ్చింది. ఈ సందర్బంగా కవితపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో క‌విత‌కు పాత్ర ఉందంటూ బీజేపీ నేతలు ఆరోప‌ణ‌లు చేసిన నేపధ్యంలో ఎమ్మెల్సీ కవిత సిటీ సివిల్ కోర్టులో పిటిష‌న్ వేసారు. మరోవైపు లిక్కర్ స్కాంలో తన ప్రమేయం లేకపోతే కవిత ఎందుకు భయపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తన్నారని ఆయన ఆరోపించారు. లిక్కర్ స్కామ్ పై ప్రజల దృష్టిని మళ్లించేందుకే అరెస్టులని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version