Site icon Prime9

Chikoti Praveen met MLA Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిసిన చీకోటి ప్రవీణ్

Rajasingh

Rajasingh

MLA Rajasingh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల క్యాసినో, వన్యప్రాణుల పెంపకంతో వార్తల్లో కెక్కిన చీకోటి ప్రవీణ్ రాజా సింగ్ ను కలిసారు. రాజాసింగ్ జైలు నుంచి విడుదలయిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు సైలెంట్ గా ఉన్నారు. అయితే ప్రవీణ్ రాజాసింగ్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ప్రవీణ్ తనకు ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని కేవలం ఒక హిందూ వాదిగానే రాజాసింగ్ ను కలిసానని చెప్పారు. , హిందూ మతాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. 77 రోజుల తర్వాత బెయిల్ పై విడుదలైన రాజాసింగ్ ను పరామర్శించేందుకు వచ్చినట్టుగా చెప్పారు. 10 ఏళ్ల క్రితం తాను రాజాసింగ్ ను కలిసినట్టుగా గుర్తు చేసుకున్నారు.పీడీ యాక్టుపై జైల్లో ఉన్న రాజాసింగ్ కు నైతిక మద్దతుఇచ్చేందుకు తాను ఇక్కడికి చచ్చినట్టుగా ఆయన తెలిపారు

కొద్దినెలల కిందట క్యాసినో, హవాలాకు సంబంధించి ప్రవీణ్‌ని ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అలాగే చీకోటి కస్టమర్లుగా ప్రముఖ రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారని తేలిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో తాను చట్టబద్ధంగానే క్యాసినో నిర్వహిస్తానని, పర్మిషన్ ఉన్న రాష్ట్రాల్లోనే ఆడతామని చెప్పిన ప్రవీణ్..త్వరలోనే రాజకీయాల్లోకి కూడా వస్తానని ప్రకటించారు.

 

Exit mobile version